
తేజ.. చిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తేజ గత కొంత కాలంగా రేసులో వెనకబడ్డారు. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ల కలయికలో తేజ తెరకెక్కించిన చిత్రం `సీత`. ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీంతో ఆలోచనలో పడ్డ తేజ వరుసగా రెండు చిత్రాల్ని చేయబోతున్నట్టు ప్రకటించారు.
రానా హీరోగా `రాక్షస రాజ్యంలో రావణాసుడు`.. గోపీచంద్ హీరోగా `అలిమేలుమంగ – వెంకట రమణ` సినిమాల్ని చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాలకి సంబంధించిన అప్డేట్ ఇంత వరకు లేదు. వీటిని పక్కన పెట్టి అంతా కొత్త వారితో సినిమా చేస్తున్నట్టు ప్రకటించి టిక్ టాక్ వీడియోలని పంపించమని ప్రకటన విడుదల చేశారు. ఈ లోగా కరోనా మహమ్మారి విళయతాండవ మొదలైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టేశారట.
తాజాగా `అలిమేలుమంగ – వెంకటరమణ` చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత వుండటంతో ఆ పాత్ర కోసం కాజల్ అగర్వాల్, సాయి పల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. తాజాగా `ఉప్పెన` ఫేమ్ కృతిశెట్టి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమెతో తేజ సంప్రదింపులు జరుపుతున్నారట. కృతిశెట్టి ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న `శ్యామ్ సింగరాయ్` చిత్రంలో నటిస్తోంది.