అఖిల్ స్టైలిష్ థ్రిల్లర్ లో ఉప్పెన భామకు చోటు?

అఖిల్ స్టైలిష్ థ్రిల్లర్ లో ఉప్పెన భామకు చోటు?
అఖిల్ స్టైలిష్ థ్రిల్లర్ లో ఉప్పెన భామకు చోటు?

ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది కృతి శెట్టి. ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఉప్పెన చిత్రంపై బోలెడన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి చిత్రం విడుదల కాకముందే కృతి శెట్టికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఉప్పెన చిత్ర ప్రోమోలతోనే ఈ హీరోయిన్ అందరినీ ఆకట్టుకోగలిగింది.

ప్రస్తుతం నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ లో హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపికైంది.  అంతే కాకుండా మరిన్ని సినిమాల్లో ఆమె నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. నాగ శౌర్య నటిస్తోన్న నెక్స్ట్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. అలాగే సూర్య – హరి కాంబినేషన్ లో రానున్న చిత్రంలో కూడా కృతి శెట్టిని ఎంపిక చేయనున్నారని టాక్.

అలాగే తాజా సమాచారం ప్రకారం అఖిల్ అక్కినేని నటించనున్న సురేందర్ రెడ్డి సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.