`ఆదిపురుష్‌`లో సీత‌ పాత్రకు ఆమె ఫైన‌ల్‌!


`ఆదిపురుష్‌`లో సీత‌ పాత్రకు ఆమె ఫైన‌ల్‌!
`ఆదిపురుష్‌`లో సీత‌ పాత్రకు ఆమె ఫైన‌ల్‌!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. రాధాకృష్ఱ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది పూర్తియిన వెంట‌నే ప్ర‌భాస్ మ‌రో ఎపిక్ డ్రామాకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీని టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో త్రీడీ ఫార్మాట్‌లో నిర్మించ‌బోతున్నారు.

జ‌న‌వ‌రి నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌పై టెస్ట్ షూట్ కూడా పూర్తియింది. `అవ‌తార్‌`ని గుర్తు చేసేలా ప్ర‌భాస్ పాత్ర వుంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇందులో రావ‌ణ్ పాత్ర‌లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టించ‌బోతున్న విష‌యం తెలిసిందే. సీత పాత్ర కోసం ప‌లువురు స్టార్ నాయిక‌ల్ని ప‌రిశీలించిన చిత్ర బృందం ఫైన‌ల్‌గా క్రితి స‌న‌న్‌ని ఎంపిక చేశారు. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా చిత్ర బృందం ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలిసింది.

రామాయ‌ణ గాథ ఆధారంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.  మ‌హేష్ న‌టించిన `వ‌న్ నేనొక్క‌డినే` మూవీతో క్రితిస‌న‌న్ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. తొలి ప్ర‌య‌త్నంగా చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. దీంతో తెలుగులో క్రితి మ‌రిన్ని ఆవ‌కాశాల్ని పొంద‌లేక‌పోయింది. `ఆదిపురురుష్‌`తో అయినా మ‌ళ్లీ తెలుగులో మ‌రిన్ని అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటుందేమో చూడాలి. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఫుల్ స్వింగ్‌లో వున్న ఈ మూవీని 2022 ఆగ‌స్టు 11ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించేశారు.