కృతి శెట్టి ఆలోచన వెనుక ఆ నిర్ణయమే ఉంది మరి

కృతి శెట్టి ఆలోచన వెనుక ఆ నిర్ణయమే ఉంది మరి
కృతి శెట్టి ఆలోచన వెనుక ఆ నిర్ణయమే ఉంది మరి

ఉప్పెన సినిమాతో హీరో, దర్శకుడు, హీరోయిన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా కృతి శెట్టి తన క్యూట్ లుక్స్, స్టన్నింగ్ యాక్షన్ తో అందరి మనసులను దోచుకుంది. ఉప్పెన సినిమా విడుదలకు ముందే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఆమె ఈ గ్యాప్ లో మూడు సినిమాలకు సైన్ చేసింది.

న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. సుధీర్ బాబు – మోహన్ కృష్ణ ఇంద్రగంటిల చిత్రంలో కూడా ఆమే హీరోయిన్. ఇక రామ్ – లింగుసామి కాంబినేషన్ లో సినిమాకు కూడా సైన్ చేసింది.

ఈ మూడు చిత్రాలు మాత్రమే ఒప్పుకున్న కృతి శెట్టి తన వద్దకు వస్తోన్న ఆఫర్లకు డేట్స్ లేవని చెప్పేస్తోందిట. ఒక హీరోయిన్ తలుచుకుంటే ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయవచ్చు. మరి కృతి పెద్ద సినిమాల కోసమే మీడియం, లో బడ్జెట్ సినిమాలకు నో అంటోందన్న రూమర్స్ ఉన్నాయి. నిజమే అయ్యుండచ్చు.