మాగంటి గోపీనాథ్ కు ఘోర అవమానం- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత


ktr insults maganti gopinath

కేటీఆర్ జూబ్లీహిల్స్ రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ నిన్నటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో పలు నియోజక వర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గెలుపు కోసం రోడ్ షో నిర్వహించడానికి వచ్చాడు. అయితే కేటీఆర్ అనుచరుడు , జూబ్లీహిల్స్ తరుపున ఇంతకుముందు నియోజక వర్గ ఇంఛార్జ్ గా వ్యవహరించిన సతీష్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేటీఆర్ ని కలవడానికి వచ్చిన సమయంలో జూబ్లీహిల్స్ తాజా మాజీ ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాథ్ అనుచరులకు సతీష్ రెడ్డి అనుచరులకు మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో ఈ విషయం కేటీఆర్ కు తెలిసి మాగంటి గోపీనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడట . అంతేకాకుండా మాగంటి ఉన్న చోటుకి రాకుండా నేరుగా మోతీ నగర్ కు వెళ్లడంతో మాగంటి గోపీనాథ్ షాకయ్యాడు.

ఈ సంఘటనలో మాగంటి గోపీనాథ్ ని అవమానించినట్లేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అందరినీ కలుపుకొని పోవాలి కానీ ఇలా గొడవ పెట్టుకోవడం ఏంటి ? అని మాగంటి ని నిలదీశాడట కేటీఆర్. దాంతో అవమానంగా భావిస్తున్నాడు మాగంటి గోపీనాథ్. గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు. అయితే ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీలో చేరాడు మాగంటి.

English Title: ktr insults maganti gopinath