మద్యం తాగి చిందేసిన మాజీ హీరోయిన్ లు


kushbu,sukanya-dance-video-goes-viralఓ స్టార్ హోటల్ లో జరిగిన పార్టీలో ఫుల్లుగా మద్యం తాగేసి ఆ మైకంలో డ్యాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు మాజీ హీరోయిన్ లు కుష్భు , సుకన్య లు . 1985- 1995 మధ్య కాలంలో తమిళ  నాట స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది కుష్భు . అలాగే సుకన్య కూడా హీరోయిన్ గా రాణించింది అప్పట్లో . కట్ చేస్తే తాజాగా ఓ స్టార్ హోటల్ లో ఈ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . బాలీవుడ్ పాటకు అనుగుణంగా కుష్భు , సుకన్య లు చేసిన డ్యాన్స్ హల్చల్ చేస్తోంది .

మద్యం మత్తులో డ్యాన్స్ చేయడంతో వాళ్లపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు .ఇటీవలే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో కీలక పాత్ర పోషించింది .  కుష్భు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉంది , తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యురాలు గా వ్యవహరిస్తోంది కుష్భు . వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వీడియో కుష్భు ని ఏం చేస్తుందో చూడాలి .