మరో “కొలవేరి” సాంగ్ లా పిచ్చేకిస్తున్న“కుట్టి స్టొరీ”


Kutti Story Lyric from Master Movie
Kutti Story Lyric from Master Movie

ఏదైనా పాట హిట్ అవ్వాలంటే ఆ పాట సందర్భం, పాట థీమ్, మ్యూజిక్, లిరిక్స్, సౌండ్ మిక్సింగ్, ఆ పాటలో ఉండే నటీ,నటులు, పాటలో చెప్పే అర్ధం, అర్ధమయ్యే అంతరార్ధం ఇవన్నీ కలిస్తే పాట హిట్ అవుతుంది. పాట ఎలా ఉండాలి.? అని చెప్పే రూల్స్ అంటూ లేవు, ఒకరకంగా ఉండే సాంగ్స్ మోడల్స్ ను అనేకమంది టాలెంటెడ్ సంగీతకారులు ఇప్పటివరకూ బ్రేక్ చేసారు.

“దళపతి” విజయ్ తాజా మూవీ అయిన “మాస్టర్” సినిమాలో రిలీజ్ చేసిన “కుట్టి స్టోరీ” అనే పాట ఇప్పుడు డిజిటల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒక్కరోజులో దాదాపు 8 మిలియన్ వ్యూస్ దాటిన ఈ పాట జనాలకు బాగా నచ్చేసింది. “లెట్ మి టెల్ ఎ కుట్టి స్టోరీ” అనే ఈ  పాట చాలా సింపుల్ ఇంగ్లీష్ & తమిళ్ పదాల కలయికతో గ్లోబల్ గా అందరికీ అర్ధం అయ్యి పాడుకునే విధంగా ఉంది. ఇక స్వయంగా “దళపతి” విజయ్ మరియు ఈ సినిమా స్వరకర్త అనిరుద్ రవిచందర్ కలిసి ఈ పాట పాడారు. ఇంత డెప్త్ ఫిలాసఫీ ఉన్న సింపుల్ & స్వీట్ పదాలతో రాసిన సాహిత్యవేత్త “అరుణ్ రాజ్ కమల్ రాజ్”. ఇంకా పాట మేకింగ్, టీజర్, ఫుల్ వీడియో సాంగ్ ఇంకెంత హిట్ అవుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ అంతగా బజ్ లేని ఈ సినిమాకు ఒక్క పాటతో ఊపు వచ్చేసింది. ఇంతకుముందు విజయ్ పై జరిగిన ఐటీ దాడుల అంశం కూడా పక్కకి వెళ్ళిపోయింది.

ఒకరకంగా తన ప్రత్యర్ధులకు విజయ్ ఇలా సమాధానం చెప్పాడు అనుకోవచ్చు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఒక స్పెషల్ పిల్లల పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తూ, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల పై పోరాడే సామాజిక కార్యకర్తగా పనిచేసే పాత్ర లో నటిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే “మెర్సేల్” సినిమాలో వైద్య వ్యవస్థ, “సర్కార్” సినిమాలో ఎన్నికల నిర్వహణ అంశాలలో లోపాలను వెలికితీసి, అందరినీ ఆలోచింప చేసారు విజయ్. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూద్దాం.