కేవి గుహ‌న్ కొత్త చిత్రం టైటిల్ ఇదే!

కేవి గుహ‌న్ కొత్త చిత్రం టైటిల్ ఇదే!
కేవి గుహ‌న్ కొత్త చిత్రం టైటిల్ ఇదే!

వైవిధ్య‌మైన లైటింగ్‌తో త‌న మార్కు ఫొటోగ్ర‌ఫీని బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు అందించి ఆ చిత్ర విజ‌యాల్లో త‌న వంతు భూమిక‌ని పోషించి ప్ర‌శంస‌లందుకున్నారు ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్‌. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన మర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ `118`తో ద‌ర్శ‌కుడిగా తెరంగేట్రం చేశారు. తొలి చిత్రంతో ద‌ర్శ‌‌కుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న ఆయ‌న తాజాగా మ‌రో చిత్రాన్నిసైలెంట్‌గా ప్రారంభించేశారు.

కె.వి.గుహ‌న్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రానికి `డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ` (హూ, వేర్‌, వై) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. తొలి మూవీని సైక‌లాజిక‌ల్ మ‌ర్డ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించిన ఆయ‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా తెర‌కెక్కిస్తున్నారు. అదిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. రామంత్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డా. ర‌వి. పి. రాజు నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో టైటిల్ లోగోని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ ` కె.వి. గుహ‌న్ తెర‌కెక్కించిన `118` మూవీ ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఆయ‌న రెండ‌వ చిత్రాన్ని కూడా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్నాం. హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమ‌న్ కె. సింగ్ సంగీతం అందిస్తుండ‌గా, మిర్చి కిర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు. త్వ‌ర‌లో టైటిల్ లోగోని రిలీజ్ చేస్తాం` అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ అమ్మిరాజు, కొరియోగ్రఫీ ప్రేమ్ ర‌క్షిత్‌, స‌హ నిర్మాత విజ‌య్ ధ‌ర‌ణ్ ప‌ట్ల‌, క‌థ‌, సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం: కెవి గుహ‌న్‌.