నాగార్జున ఇంటి ముందు లొల్లి చేసిన యువతి


lady created hungama in front of Nagarjuna houseకింగ్ నాగార్జున ఇంటి ముందు ఓ యువతి రాత్రి పూట లొల్లి లొల్లి చేసి నానా హంగామా చేసింది . నాగార్జున నాకు 4 కోట్ల రూపాయలు ఇవ్వాలని , నన్ను లోపలకు పంపించండి అంటూ పెద్ద గొడవ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు నాగార్జున సెక్యూరిటీ దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆ యువతి ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు . కాగా ఆ యువతి వివరాలు కనుక్కోగా మతిస్థిమితం లేని యువతి అని తేలింది .

ఆదిలాబాద్ కు చెందిన విజయ గా ఆ యువతి ని గుర్తించారు పోలీసులు , మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు . అయితే మొదట ఈ యువతి నాగార్జున ని చూడాలని వచ్చిందట ! ఆ తర్వాత నాగార్జున నాకు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని గొడవ చేయడం సంచలనం సృష్టించింది .

అయితే ఈ గొడవ జరుగుతున్న సమయంలో నాగార్జున ఇంట్లో లేకపోవడంతో సెక్యూరిటీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు . నాగార్జున ప్రస్తుతం నాని తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు .

English Title: lady created hungama in front of Nagarjuna house