నా మొగుడు నా బీరు నా ఇష్టం అంటున్న మహిళ


lady fires on drunk and drive

నా మొగుడు ఒక్క బీరు తాగి డ్రైవ్ చేస్తే తప్పేంట్రా అంటూ అర్ధరాత్రి ఓ మహిళ ట్రాఫిక్ పోలీసులపై జులుం ప్రదర్శించింది . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . నా మొగుడు ….. నా మొగుడు ….. నా మొగుడు అంటూ కనీసం వంద సార్లైనా అని ఉంటుంది అంతేకాదు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది ఆ మహిళ . ఒక్క బీరు తాగితే తప్పేంటి ? అలా తాగడం తప్పైతే మద్యం దుకాణాలు రాత్రి వరకు ఉంచకుండా మూసేయండి అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించింది అలాగే ఈ మొత్తం తతంగమంతా వీడియో కూడా తీసింది .

నాకు ఫేస్ బుక్ లో బోలెడు అకౌంట్ లున్నాయని అలాగే ఇతర మాధ్యమాల్లో కూడా పెడతానని పోలీసుల ముందే హెచ్చరిస్తూ చెప్పడంతో అడ్డుకున్నారు దాంతో ఆ మహిళ మరింతగా రెచ్చిపోయింది . ఈ దశలో సదరు మహిళ భర్తపై పోలీసులు దాడి చేయడంతో నా మొగుడ్ని కొడతారా అంటూ వీరంగం వేసింది . ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్ లో అలాగే ఇతర మాధ్యమాల్లో వైరల్ అవుతోంది . తాగి నడిపిస్తున్న భర్త ని వెనకేసుకురావడం మహిళా తప్పే ! అలాగే అర్ధరాత్రి వరకు బార్లు , రెస్టారెంట్ లు కొనసాగేలా చేస్తూ జేబులు గుల్లజేయడమే కాకుండా ఆరోగ్యాన్ని హరించేలా చేస్తున్నారు అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అడ్డుకుంటూ పౌరుల జీవితంతో ఆడుకుంటున్నారు పోలీసులు .

English Title: lady fires on drunk and drive