లగడపాటి సర్వే వచ్చేసింది


Lagadapati rajagopal survey came

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లగడపాటి రాజగోపాల్ సర్వే రానే వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్టిడిపి నేతృత్వంలోని ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పాడు. కాంగ్రెస్ – టీడీపీ కూటమికి 65 స్థానాలు రాబోతున్నాయని కేసీఆర్ కు 35 స్థానాలు మాత్రమే వస్తున్నాయని చెప్పాడు. అలాగే భారతీయ జనతా పార్టీ గతంలో కంటే బెటర్ గా మరో 2 స్థానాలు పెరిగే ఛాన్స్ ఉందని , ఇండిపెండెంట్ లు కూడా గెలిచే ఛాన్స్ ఉందని అయితే ఒక పది సీట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అని కూడా చెప్పాడు.

మొత్తానికి లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం పడిపోతోంది. కేసీఆర్ కు ఇది పెద్ద ఓటమి అనే చెప్పాలి రాజగోపాల్ చెప్పిందే నిజమైతే. అయితే లగడపాటి కాకుండా ఇతరులు కూడా సర్వేలు చేశారు. ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని . ఈ సర్వేల ఫలితాలు పక్కన పెడితే ఈనెల 11 న అసలు ఫలితాలు రానున్నాయి.