హీరో దగ్గర చెమట కంపు అంటా..హీరో పేరు మాత్రం చెప్పలేదు…

Lakshmi Manchu New Show Experience
Lakshmi Manchu New Show Experience

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా నటన రంగం లోకి దిగిన ‘మంచు’ నటి “లక్ష్మి ప్రసన్న“. తాను నటించిన సినిమాలు తక్కువ కానీ బుల్లితెర ప్రోగ్రామ్ లు ఎక్కువ అని మనకి తెలుసు కదా. ఇప్పుడు తన కొత్త ప్రోగ్రామ్ “ఫీటప్ విత్ స్టార్స్”..అంటే సెలెబ్రెటీస్ పడక గది రహస్యాలు కూడా అడగ వచ్చు అంటా ఈ ప్రోగ్రామ్ లో.

ఒకప్పుడు మేము సైతం అనే మంచి ప్రోగ్రామ్ చేసిన లక్ష్మి ఈ సారి వింత ప్రోగ్రామ్ తో వస్తుంది అని అందరూ ఎదురుచూసారు. అప్పటికి సమంత, వరుణ్ తేజ్ లని హోస్ట్ ద్వారా ప్రశ్నలు అడిగిన తను రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా ప్రశ్నలు అడగగా రకుల్ ప్రీత్ సింగ్ తన షూటింగ్ లొకేషన్ లో జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్పింది.

అది ఏమిటంటే…రకుల్ మంచి రొమాంటిక్ సాంగ్ కోసం షూటింగ్ జరుగుతుంటే హీరోతో కలిసి రొమాన్స్ చేయాలి.. అలాంటి సందర్భంలో హీరోకి దగ్గరగా వెళ్లిన రకుల్ కి హీరోగారి చెమట కంపు రకుల్ ని తెగ ఇబ్బంది పెట్టిందట. కానీ రకుల్ హీరో కి చెప్తే బాగోదు అని చెప్పి తానే పెర్ఫ్యూమ్ కొట్టుకొని యధావిధిగా సాంగ్ షూటింగ్ జరుపుకుంది అంటా. ఇది విన్న లక్ష్మి గారు హీరో పేరు అడగగా నీకు ఇదివరకే చెప్పిన కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడగటం అని వారించింది.

నిజంగా రకుల్ హీరో పేరు చెప్పకపోయే సరికి లక్ష్మి కి అయినా తెలుసు కదా చెప్పొచ్చు కదా అని షో చూస్తున్న ప్రేక్షకుల మనసులో మాట. మరి ఇద్దరు కలిసి ఆ హీరో పేరు చెప్పకపోవడం వలన ఏదో పెద్ద సమస్యే ఉంది అని మనం అనుకోవచ్చు.