సెలెబ్రిటీల రాత్రి జీవితం గుట్టు విప్పుతానంటోన్న లక్ష్మి మంచు


Manchu Lakshmi
సెలెబ్రిటీల రాత్రి జీవితం గుట్టు విప్పుతానంటోన్న లక్ష్మి మంచు

సెలెబ్రిటీల జీవితాలంటే ప్రతి ఒక్కరికీ తెలియని ఆసక్తి ఉంటుంది. వాళ్ళ జీవితాలలో ఎలాంటి విశేషాలు జరుగుతాయో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుందని తెలిసినా కానీ సాధారణ ప్రజలు మాత్రం సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికే ఇష్టపడతారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. తెలుగులో సరికొత్త సెలబ్రిటీ టాక్ షో రాబోతోంది. టాక్ షో అంటే ఆ సెలెబ్రిటీ గురించి కొన్ని ప్రశ్నలడగడం, లేదా వాళ్లతో ఫన్నీ గేమ్స్ ఆడించడం, లేదా వాళ్ళ జీవితం పొద్దున్న నుండి సాయంత్రం వరకూ ఎలా ఉంటుందో చూపించడం ఇలాంటివి జరుగుతుంటాయి.

కానీ ఈసారి సరికొత్తగా లక్ష్మి మంచు హోస్ట్ గా సెలెబ్రిటీల నైట్ లైఫ్ ఎలా ఉండబోతోందో చూపించబోతున్నారు. వారు ఆ సమయంలో ఏం చేస్తారు, వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుంది వంటి విషయాలను లక్ష్మి మంచు స్వయంగా అడిగి తెలుసుకోబోతున్నారు. బాలీవుడ్ లో ఫూట్ అప్ విత్ స్టార్స్ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. దానికి తెలుగు వెర్షనే ఇది. ఈ నెల 23 నుండి ఈ షో ప్రసారం కాబోతోంది. మరి లక్ష్మి మంచు ఎవరెవరితో ఈ షో చేయబోతోందో, వారు చెప్పే విశేషాలేంటో తెలుసుకోవాలనుంది కదా.