లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 15 న ?


Lakshmi's ntr release date

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ బయోపిక్ కు వ్యతిరేకంగా రూపొందించిన ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడి ని విలన్ గా చూపించాడు వర్మ . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ , టీజర్ , వీడియో సాంగ్ లతో సినిమాపై అంచనాలు పెరిగాయి .

 

అయితే రాంగోపాల్ వర్మ ఎప్పుడు కూడా ట్రైలర్ లను , టీజర్ లను బాగానే కట్ చేయిస్తాడు కానీ సినిమాలో ఆశించిన స్థాయిలో మ్యాటర్ ఉండదని ఇటీవల పలు చిత్రాల ద్వారా నిరూపితం అయిన విషయం తెలిసిందే . లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై అయితే అంచనాలు నెలకొన్నాయి . ఎన్టీఆర్ బయోపిక్ అట్టర్ ప్లాప్ కావడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది . సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు వర్మ ఎలా తీసాడు అన్నది . మార్చి 15 న ఈ సినిమాని రిలీస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు వర్మ . రిలీజ్ అవుతుందా ? ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అన్నది చూడాలి .

 

English Title: Lakshmi’s ntr release date