లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ కడపలో


Lakshmi's ntr release event in kadapa

కడపలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ ఎన్టీఆర్ నైట్ ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . గతకొద్ది రోజులుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం  రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే . ఈనెల 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అందులో భాగంగా కడపలో వెన్నుపోటు ఈవెంట్ అంటూ ట్వీట్ చేసాడు వర్మ .

 

కడపలో ఈవెంట్ అన్నాడు కానీ తేదీ మాత్రం ప్రకటించలేదు , తేదీ ని త్వరలోనే ప్రకటిస్తాను అని స్పష్టం చేసాడు వర్మ . అయితే ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల వల్ల రాజకీయంగా మాకు నష్టం అంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘం ని ఆశ్రయించింది . దాంతో ఈనెల 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందా ? లేదా అన్న అనుమానం నెలకొంది .

English Title: Lakshmi’s ntr release event in kadapa