ప్ర‌తీ పెగ్గుకీ ఓ క‌థ వుందంట‌!


ప్ర‌తీ పెగ్గుకీ ఓ క‌థ వుందంట‌!
ప్ర‌తీ పెగ్గుకీ ఓ క‌థ వుందంట‌!

భార‌త్ సాగ‌ర్, య‌శ‌స్విని ర‌వీంద్ర జంట‌గా స‌రికొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రం `లాస్ట్ పెగ్‌`. `ఎవ్రీ పెగ్ హాస్ ఏ స్టోరీ` అని క్యాప్ష‌న్‌. సంజ‌య్ వ‌డ‌త్ ఎస్‌. ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భ‌వ‌స్పంద‌న ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌జ‌త్ దుగోజీ స‌లేంకి నిర్మిస్తున్నారు. మ‌నిషి జీవితంలో జ‌రిగే కాలానికి సంబంధించిన ఓ అంశం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర యాక్ష‌న్ టీజ‌ర్‌ని చిత్ర బృందం గురువారం విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ మాట్లాడుతూ `ప్రేమ‌లో ప‌డిన యువ‌తీ యువ‌కులు చివ‌రికి త‌మ ప్రేమ‌ని కాద‌ని చివ‌రికి త‌ల్లిదండ్రులు నిర్ణ‌యించిన వారితో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు. మా సినిమాలోనే అదే త‌ర‌హాలో హీరో హీరోయిన్‌ల ప్రేమ‌ని అర్థం చేసుకోని వారి త‌ల్లిదండ్రులు వేరొక‌రితో నిశ్చితార్థం జ‌రుపుతారు. కొన్ని అనుకోని ప‌రిస్థితుల్లో ఆ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన యువ‌కుడు అదే అమ్మాయి మాజీ ప్రియుడు క‌లుసుకుంటారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?  వారి జీవితాల‌తో విధి ఆడిన నాట‌కం ఏంటి? అన్న‌దే ఇందులో ఆస‌క్తిక‌రం`అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజ‌య్ మాట్లాడుతూ ` తాజాగా యాక్ష‌న్ టీజ‌ర్ ను విడుద‌ల చేశాం. మంచి స్పంద‌న ల‌భిస్తోంది. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించ‌బోతున్నాం.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అలరించే అంశాల‌న్నీ ఈ చిత్రంలో వున్నాయి. యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయ‌ని తెలిపారు.