గ్యాంగ్ లీడర్ లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్


gang-leader-box-office
gang-leader-box-office

నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రం మిశ్రమ స్పందనతో మొదలైనా తొలి వారాంతం డీసెంట్ వసూళ్లనే సాధించింది. అయితే సోమవారం నుండి ఈ చిత్రం స్లో అవుతూ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం గ్యాంగ్ లీడర్ ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లను వసూలు చేయగలిగింది. ఇప్పటికీ ఈ సినిమా ఇంకా నడుస్తున్నా నిన్న విడుదలైన వాల్మీకి మంచి టాక్ తెచ్చుకోవడం, గ్యాంగ్ లీడర్ కు ప్రతికూలంగా మారింది.

సూర్య బందోబస్త్ కూడా విడుదలైనా, దాని వల్ల కలిగే డామేజ్ చాలా తక్కువ. వాల్మీకి చిత్రాన్ని గ్యాంగ్ లీడర్ ఎలా ఎదుర్కొంటాడు అన్న దాన్నిబట్టి నాని సినిమా హిట్ ఆ ఫట్ ఆ అన్నది తేలాల్సి ఉంది. గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 29 కోట్లకు జరిగిన నేపథ్యంలో మరో 9 కోట్లు రావాలంటే చాలా కష్టం అనే చెప్పాలి.