ప్రభాస్ సినిమా లేటెస్ట్ న్యూస్ !


Latest news of prabhas new film
Latest news of prabhas new film

బాహుబలి అనంతరం సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న రెబల్ స్టార్ మరో బిగ్ బడ్జెట్ సినిమా అంటే భయపడుతున్నాడు. అనుభవం లేని దర్శకుడిని నమ్మి ప్రభాస్ పడిన కష్టం వృధా అయ్యింది. పైగా ఆ ప్లాప్ ఎఫెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఎంతో కొంత చూపిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం డార్లింగ్ సౌత్ ఆడియెన్స్ ని ఎలాగైనా మెప్పించాలని జాన్ సినిమాతో రెడీ అవుతున్నాడు.

సాహోకి బాలీవుడ్ లో పాజిటివ్ టాక్ రావడంతో బాలీవుడ్ లో ‘జాన్‘ని డబ్ చేయకతప్పడు. ఇకపోతే జాన్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ప్రభాస్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకనున్నట్లు సమాచారం. హైదరాబాద్ , రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఒక స్పెషల్ సెట్ ని నిర్మిస్తున్నారు. షూటింగ్ కి రెండు రోజుల ముందే ఈ సెట్స్ కి సంబంధించిన పనులన్నీ ఫినిష్ చేయనున్నారు.
ఇక ప్రభాస్ డైరెక్ట్ గా మొదటిరోజు లొకేషన్ కి వెళ్లి షూటింగ్ స్టార్ట్ చేయడమే తరువాయి. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక డార్లింగ్ సరసన లవర్ గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ జిల్ సినిమాతో సక్సెస్ అందుకున్న రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.