హాకీలో శిక్షణ తీసుకుంటున్న అందాల రాక్షసిహాకీలో శిక్షణ తీసుకుంటున్న అందాల రాక్షసి
హాకీలో శిక్షణ తీసుకుంటున్న అందాల రాక్షసి

అందం, అభినయం కలిసి ఉన్న కథానాయిక లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆమె నటించిన భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలు ఆమె కెరీర్ కు ప్లస్ అయింది. ప్రస్తుతం లావణ్య రెండు సినిమాల్లో నటిస్తోంది. సందీప్ కిషన్ నటిస్తోన్న ఏ1 ఎక్స్ప్రెస్ లో హీరోయిన్ గా నటిస్తోంది లావణ్య త్రిపాఠి. ఈ చిత్రంలో కథానుసారంగా హాకీ ప్లేయర్ గా కనిపించాల్సి ఉండడంతో లావణ్య ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నటనలో పెర్ఫెక్షన్ కోసం ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా హాకీలో శిక్షణ మాత్రం ఆపట్లేదని సమాచారం. ఉదయమే హాకీలో ట్రైనింగ్ తీసుకుని చెన్నై వెళ్లి షూటింగ్ చేసుకుని ఒక వారం పాటు బిజీ బిజీగా గడిపింది.

లావణ్య త్రిపాఠి ఏ1 ఎక్స్ప్రెస్ తో పాటు కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న చావు కబురు చల్లగా సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు సినిమాలతో లావణ్య తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.