త‌న‌ని వేధిస్తున్న వ్య‌క్తిపై కేసు పెట్టిన అందాల రాక్ష‌సి!


త‌న‌ని వేధిస్తున్న వ్య‌క్తిపై కేసు పెట్టిన అందాల రాక్ష‌సి!
త‌న‌ని వేధిస్తున్న వ్య‌క్తిపై కేసు పెట్టిన అందాల రాక్ష‌సి!

లావ‌ణ్య త్రిపాఠికి త‌న‌కు పెళ్ల‌యిపోయింద‌ని, త‌మ‌న్నాని కూడా పెళ్లాడాన‌ని, వ‌న్ నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాల్ని సుకుమార్ బ్ర‌తిమాలడం వ‌ల్ల వ‌దిలేశాన‌ని ఇటీవ‌ల సునిశిత్ అనే ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలోనూ, ప‌లు యూట్యూబ్ ఛాన‌ళ్ల‌లోనూ ఎలాంటి బెరుకు లేకుండా స్టేట్‌మెంట్‌లు ఇవ్వ‌డం టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. తెలియ‌ని వాళ్లు అవునా అని అవాక్కియితే తెలిసిన వాళ్లు పిచ్చివాడి మాట‌ల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని లైట్ తీసుకున్నారు.

అయినా సునిశిత్ మాట‌ల‌కి అద్దు అదుపు లేకుండా పోయింది. కొంత మందికి అబార్ష‌న్‌లు కూడా చేయించాన‌ని చెత్త వాగుడు వాగ‌డంతో ఆ వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఆగ్ర‌హాన్ని వ్యక్తం చేసిన హీరోయిన్ లావ‌న్య త్రిపాఠి త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్న సునిశిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హ‌ద్దులు దాటి మాట్లాడుతూ అస‌భ్య ప‌దాలంతో వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని, సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఈ మెయిల్ ద్వారా స‌ద‌రు వ్య‌క్తిపై కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లావ‌ణ్య త్రిపాఠిపై అస‌త్య ప్రచారం చేస్తున్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.