“లావణ్య రావు” గా మారిన లావణ్య త్రిపాఠిLavanya tripathi look in A1 express movie
Lavanya tripathi look in A1 express movie

అదేంటీ..? ఇంత సడెన్ గా లావణ్యా త్రిపాఠి కాస్తా, లావణ్య రావు అయిపొయింది, అంటే అదే మన సందీప్ కిషన్ సినిమా కోసం. ఈ ఏడాది “నిను వీడని నీడను నేనే” సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న సందీప్ కిషన్ మరొక డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు A1 ఎక్స్ ప్రెస్. అందులో హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ. ఇందులో ఆమె హాకీ ప్లేయర్ లావణ్య రావు క్యారెక్టర్ లో నటిస్తోంది . ఇందుకు సంబంధించి ఆమె హాకీ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటునట్లు సమాచారం. లావణ్య బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

“చిన్నపటినుండి హాకీ నేర్చుకోవాలి అనుకున్నా, మా అమ్మ కూడా హాకీ క్రీడాకారిణి . ఇప్పుడు నేను ఇలా హాకీ ప్లేయర్ గా నటించడం చాల ఆనందంగా ఉంది ” అని సంబరపడిపోతోంది లావణ్య. ఈ సినిమాను టీ.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్, దయా, సందీప్ కిషన్ నిర్మిస్తున్నారు. “హిప్ హాప్ తమిళ” ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా, జీవన్ దర్శకత్వం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ అంత హిట్ అవ్వాలని కోరుకుందాం.