ఇక లావ‌ణ్య ద‌శ తిరిగి న‌ట్టేనా?


ఇక లావ‌ణ్య ద‌శ తిరిగి న‌ట్టేనా?
ఇక లావ‌ణ్య ద‌శ తిరిగి న‌ట్టేనా?

లావ‌ణ్య త్రిపాఠ యంగ్ హీరోయిన్‌. ప్ర‌స్తుతం త‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ త‌గ‌లాల‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఆమె ఎదురుచూపులు ఫ‌లించిన‌ట్టున్నాయి. లావ‌ణ్య‌ని వెతుక్కుంటూ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఆమెని వ‌రించింది. ఇంకేముందు ఆమె ఆనందానికి హ‌ద్దేలేకుండా పోయింద‌ట‌. ఇంత‌కీ లావ‌ణ్య‌కు లభించిన బంప‌ర్ ఆఫ‌ర్ మ‌రేదో కాదండోయ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. య‌స్‌.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్య‌ణ్ రెండేళ్ళ విరామం త‌రువాత వ‌రుస చిత్రాల‌తో స్పీడు పెంచిన విష‌యం తెలిసిందే.

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా రూపొందుతున్న`వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ అండ్ ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోకు హ్యూజ్ అప్లాజ్ వ‌చ్చింది. సినిమా ఓ రేంజ్‌లో వుండ‌బోతోంద‌నే సంకేతాల్ని అందించింది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వుంటుంద‌ట‌. అందులో ప‌వ‌న్‌కు హీరోయిన్ వుంటుద‌ని, ఆ పాత్ర‌లో శృతిహాస‌న్‌, లేదా ఇలియానా న‌టించే అవ‌కాశాలు వున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఇందులో ప‌వ‌న్‌కు జోడీ ఒక్క‌రు కాదు ఇద్ద‌రు భామ‌లు వుంటార‌ని, ఒక‌రు ఇలియానా, లేదా శృతిహాస‌న్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు వుండే అవ‌కాశం వుంద‌ని, ఇక రెండ‌వ హీరోయిన్‌గా మాత్రం లావ‌ణ్య త్రిపాఠి వుంటుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే చిత్ర బృందం ఆమెని ఫైన‌ల్ చేసిన‌ట్టు తాజా స‌మాచారం. ఇదే నిజ‌మైతే హీరోయిన్‌గా లావ‌ణ్య ద‌శ తిరిగిన‌ట్టే అంటున్నారు.