సందీప్ మ్యాచో లుక్‌పై లావ‌ణ్య కామెంట్‌!సందీప్ మ్యాచో లుక్‌పై లావ‌ణ్య కామెంట్‌!
సందీప్ మ్యాచో లుక్‌పై లావ‌ణ్య కామెంట్‌!

లాక్‌డౌన్ టైమ్ నుంచి థింక్ పాజిటివ్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్ట‌డం మొద‌లుపెట్టి పాజిటివిటీని పెంచే ప్ర‌య‌త్నం చేశాడు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌. ప్ర‌స్తుతం `ఏ1 ఎక్స్‌ప్రెస్` మూవీ చిత్రంలో న‌టిస్తున్న సందీప్ కిష‌న్ షాకింగ్ లుక్‌తో స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్ర‌త్యేకంగా ఈ మూవీ కోసం ట్రైన‌ర్ స‌హాయంతో సిక్స్ ప్యాక్ లుక్‌లోకి మారిపోయిన సందీప్ కిష‌న్ త్వ‌ర‌లో త‌న పంథాను మార్చుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌కు తానూ సిద్ధ‌మ‌నే సంకేతాల్ని అందించ‌డానికే సందీప్ కిష‌న్ ఇలా సిక్స్ ప్యాక్ లుక్‌తో మ్యాచో మ్యాన్‌గా రెడీ అయ్యాడ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సందీప్ త‌న సిక్స్ ప్యాక్ బాడీ లుక్‌కి సంబంధించిన పిక్స్‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల‌పై ముచ్చ‌ట‌ప‌డిన క్రేజీ హీరోయిన్ అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి హాట్ కామెంట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సందీప్‌కిష‌న్ సిక్స్ ప్యాక్ బాడీని చూసిన అందాల రాక్ష‌సి త‌మ మ‌న‌సులోని మాట‌ని బ‌య‌ట‌పెట్టేసింది. `ఏ1 ఎక్స్‌ప్రెస్‌` మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌తో క‌లిసి న‌టించ‌డాన్ని చాలా ఎంజాయ్ చేశాను` అని కామెంట్ చేసింది. సందీప్‌తో క‌లిసి లావ‌ణ్య ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం  కాబోతోంది.