ప్రకాష్ రాజ్ కు కోర్టు నోటీసులు


Legal notice to Prakash raj

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటాడు . తాజాగా ముంబై కోర్టు నోటీసులు అందుకొని మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ నటుడు . ఇతడికి నోటీసులు ఎందుకు వచ్చాయంటే …… తెలుగులో ఆమధ్య వచ్చిన” ఉలవచారు బిర్యానీ ” చిత్రాన్ని హిందీలో ” తడ్కా ” అనే టైటిల్ తో రీమేక్ చేసాడు ప్రకాష్ రాజ్ . అయితే దీనికి జీ స్టూడియోస్ తో పాటుగా ప్రకాష్ రాజ్ బందువు కూడా నిర్మాతలుగా వ్యవహరించారు.

 

నిర్మాతలుగా ఉన్నారు కాబట్టి జీ స్టూడియోస్ వాళ్ళు 60 శాతం వాటా , ప్రకాష్ రాజ్ బంధువు 40 శాతం వాటా అనుకున్నారట ! మీరు మీరు అనుకున్నారు బాగానే ఉంది మరి నా పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించాడు ప్రకాష్ రాజ్ అదిగో అక్కడ మొదలయ్యిందట లొల్లి . దాంతో రెండేళ్లుగా తడ్కా చిత్రం విడుదల కావడం లేదు అందుకే జీ స్టూడియోస్ లీగల్ నోటీసులు పంపించారు . ప్రకాష్ రాజ్ సమాధానం ఎలా , ఏమని చెబుతాడో చూడాలి .

English Title: Legal notice to Prakash raj