మరో బయోపిక్ కూడా స్టార్ట్ అయ్యింది


legendary director k vishwanath biopic launched

బాలీవుడ్ లో మాత్రమే కాదు తెలుగునాట కూడా బయోపిక్ ల పర్వం మొదలయ్యింది . మహానటి ఇచ్చిన ఊపుతో వరుసగా బయోపిక్ లు రూపొందుతున్నాయి . ఇప్పటికే ఎన్టీఆర్ , యాత్ర బయోపిక్ లు సెట్స్ పై ఉండగా మరో నాలుగైదు బయోపిక్ చిత్రాలను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు అందులో ” విశ్వదర్శనం ” కూడా ఒకటి . లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ బయోపిక్ ఈ విశ్వదర్శనం కావడం విశేషం . తెలుగునాట అజరామరమైన చిత్రాలను ఎన్నింటినో అందించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను , రివార్డులను పొందిన మహనీయుడు కే విశ్వనాథ్ .

ఈ బయోపిక్ నిన్న లాంఛనంగా ప్రారంభమైంది అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం త్వరలో ప్రారంభం కానుంది . ఇక విశ్వనాద్ పాత్రలో ఎవరు నటిస్తారు , అందులో సంచలనం సృష్టించే అంశాలు ప్రస్తావిస్తారా ? తదితర విషయాలన్నీ త్వరలోనే తెలియనున్నాయి . ఇక ఈ చిత్రానికి జనార్ధన మహర్షి దర్శకత్వం వహించనున్నాడు . సంగీత సాహిత్యాల పరంగా ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన ఘన చరిత్ర కె విశ్వనాథ్ గారిది . ఇక ఈ బయోపిక్ ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో చూడాలి .

English Title: legendary director k vishwanath biopic launched