రూమ‌ర్‌ల‌పై ఘాటుగా స్పందించిన జాన‌కి!


రూమ‌ర్‌ల‌పై ఘాటుగా స్పందిన జాన‌కి!
రూమ‌ర్‌ల‌పై ఘాటుగా స్పందిన జాన‌కి!

సోష‌ల్ మీడియా ప్ర‌పంచాన్ని కుగ్రామంగా మార్చింది. ప్ర‌పంచంలోని ఏ మూల ఏది జ‌రిగినా క్ష‌ణాల్లో సోష‌ల్ మీడియా కార‌ణంగా జ‌నాల‌కి తెలిసిపోతోంది. అయితే అంతే స్పీడుగా ఫేక్ న్యూస్ ఈ మ‌ధ్య‌  వైర‌ల్‌గా మారుతోంది. దీని వ‌ల్ల కొంత మంది సెల‌బ్రిటీలు మాన‌సికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటున్న వారు హ‌ఠాత్తుగా చ‌నిపోయారంటూ ఈ మ‌ధ్య ఫేక్ న్యూస్ లు వైర‌ల్‌గా పుట్టుకొస్తున్నాయి.

తాజాగా అలాంటి ఫేక్ న్యూసే ప్ర‌ముఖ గాయ‌ని ఎస్‌. జాన‌కిపై పుట్టుకొచ్చింది. లెజెండ‌రీ సింగ‌ర్ ఎస్‌. జాన‌కి ఇక లేరంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఫేక్ న్యూస్ వైర‌ల్‌గా మారింది. దీంతో షాక్‌కు గురైన ఆమె అభిమానులు వ‌రుసగా ఫోన్ లు చేస్తూ విల‌పిస్తున్నార‌ట‌. త‌న‌పై వ‌స్తున్న ఫేక్ న్యూస్‌పై లెజెండ‌రీ గాయ‌నీ ఎస్‌. జాన‌కీ మండిప‌డ్డారు.

`నేను ప్ర‌స్తుతం మైసూర్‌లో వున్నాను. హైద‌రాబాద్‌లో లేను., నేను చాలా ఆరోగ్యంగా ఫ‌స్ట్ క్లాస్‌గా వున్నాను. నాకు ఏమీ కాలేదు. ఎవ‌రెవ‌రో పిచ్చి పిచ్చిగా న్యూస్ పెడుతుంటారు. అలాంటి వార్త‌ల్ని న‌మ్మితే మ‌నం ఏమీ చేయ‌లేం. చాలా మంది అభిమానులు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. వారిని ఓదార్చ‌డ‌మే స‌రిపోయింది. పిచ్చి పిచ్చి పిచ్చిగా వాళ్లు చ‌చ్చారు.. వీళ్లు చ‌చ్చారంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. నేను బాగానే వున్నా. హైద‌రాబాద్‌లోనే క‌రోనా తీవ్రంగా వుంద‌ని తెలిసింది మీరు జాగ్ర‌త్త‌గా వుండండి` అంటే అభిమానుల‌కు జాన‌కి జాగ్ర‌త్త‌లు చెబుతూ ఓ ఆడియో సందేశాన్ని పంపించారు. ప్ర‌స్తుతం ఈ ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.