మార్చిలో చంపేద్దాం.. ఏప్రిల్‌లో ..!


మార్చిలో చంపేద్దాం.. ఏప్రిల్‌లో ..!
మార్చిలో చంపేద్దాం.. ఏప్రిల్‌లో ..!

క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రినీ విడిచి పెట్ట‌డం లేదు. ఏ రంగాన్నీ వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న క్రేజీ రంగాల‌ని కూడా క‌రోనా వైర‌స్ అల్ల‌ల్లాడిస్తోంది. ఎంత నిర్భ‌యంగా వున్నా త‌న ప్ర‌తాపంతో బెంబేలెత్తిస్తోంది. దీని ధాటికి చాలా మంది సెల‌బ్రిటీలు షూటింగ్‌లు, మీటింగ్‌లు వాయిదా వేసుకుంటున్నారు. కొంత మంది భ‌య‌ప‌డ‌క‌పోయినా కొంత మంది మాత్రం క‌రోనాకు దాసోహం అన‌క త‌ప్ప‌డం లేదు.

దీని ఎఫెక్ట్ తాజాగా సినిమా షూటింగ్‌ల‌తో, సినిమా రిలీజ్‌ల‌పై, థియేట‌ర్ల‌పై ప్ర‌ధానంగా ప‌డింది. దీంతో కొంత మంది షూటింగ్‌లు ఆపేస్తుంటే మ‌రి కొంత మంది త‌మ సినిమా రిలీజ్‌లు వాయిదా వేసుకుంటున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని కూడా త‌ను తొలిసారి నెగెటివ్ ఛాయలున్న పాత్ర‌లో న‌టించిన `వి` చిత్ర రిలీజ్‌ని వాయిదా వేసుకున్నాడు. దీనికి సంబంధించిన చిత్ర బృందం శ‌నివారం మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న‌ని కూడా విడుద‌ల చేసింది.

ఈ సంద‌ర్భంగా నాని సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఆస‌క్తి క‌ర‌మైన పోస్ట్‌ని పెట్టారు.. మార్చిలో క‌రోనా వైర‌స్‌ని చంపేద్దాం. ఏప్రిల్‌లో ఉగాదిని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుందాం.. అందు కోసం వి విల్ వేయిట్ అంటూ ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశారు. త‌న‌దైన స్టైల్లో స్పందించే నాని పెట్టిన ఈ పోస్ట్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Credit: Twitter