లైగర్ ఓటిటి రిలీజ్ వార్తలపై కౌంటర్ వేసిన విజయ్ దేవరకొండ

లైగర్ ఓటిటి రిలీజ్ వార్తలపై కౌంటర్ వేసిన విజయ్ దేవరకొండ
లైగర్ ఓటిటి రిలీజ్ వార్తలపై కౌంటర్ వేసిన విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్ లో తొలిసారి ప్యాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేస్తోన్న లైగర్ ను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని సహ నిర్మిస్తున్నాడు. జనవరి 2020లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అయితే అప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ కు కరోనా బ్రేకులు వేస్తోంది.

ఇదిలా ఉంటే లైగర్ ఒక భారీ డీల్ క్లోజ్ చేసిందని, ఒక ప్రముఖ ఓటిటి సంస్థ డైరెక్ట్ రిలీజ్ కు దాదాపు 200 కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకుందని తెలిపింది. దీనికి విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పందించాడు.

లైగర్ థియేట్రికల్ రిలీజ్ అయితే దానికంటే ఎక్కువే వసూలు చేస్తుందని, ఈ సినిమా బిజినెస్ స్థాయి దానికంటే చాలా ఎక్కువని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న లైగర్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.