లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కి తొలగిన అడ్డంకి


Line clear for Lakshmi's ntr

వివాదాస్పద చిత్రం ”లక్ష్మీస్ ఎన్టీఆర్ ” చిత్ర విడుదలకు అడ్డంకి తొలగిపోయింది . లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే . దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 22 న విడుదల అవుతుందా ? అన్న అనుమానం నెలకొని ఉండే కానీ తాజాగా ఎన్నికల సంఘం ఈ విషయం పై స్పందించడంతో రిలీజ్ కి అడ్డంకి తొలగిపోయింది .

 

సినిమా రిలీజ్ ని ఎన్నికల సంఘం అడ్డుకోదు ,కాకపోతే ఒక వ్యక్తికీ , పార్టీకి లాభం చేకూరేలా సన్నివేశాలు ఉంటే అప్పుడు చర్యలు తీసుకుంటాం కానీ రిలీజ్ కాకుండా అడ్డుకోలేమని తేల్చి చెప్పాడు రజత్ కుమార్ . ఎన్నికల సంఘం ఆంక్షలు లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనెల 22న రిలీజ్ కానుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ . రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వివాదాలను సృష్టిస్తోంది .

English Title : Line clear for Lakshmi’s ntr