ఆ రెండు సినిమాలు ప్లాప్: విజయ్ దేవరకొండ లక్కీ


Line clear for vijay devarakonda నిన్న విడుదలైన శ్రీనివాస కళ్యాణం చిత్రానికి అంతగా పాజిటివ్ టాక్ లేదు కేవలం ఫ్యామిలీ చిత్రాలు కోరుకునే వాళ్లకు మాత్రమే ఆ సినిమా నచ్చింది , ఇక ఈరోజు రిలీజ్ అయిన విశ్వరూపం 2 డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది అంటే రెండు సినిమాలు ప్లాప్ అన్నమాట దాంతో విజయ్ దేవరకొండ లక్కీ ఫెల్లో అయినట్లే ! ఈ హీరో నటించిన ” గీత గోవిందం ” ఈనెల 15న విడుదల అవుతోంది . పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మించారు . విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించగా ఈ సినిమాకు యూత్ లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది .

నితిన్ శ్రీనివాస కళ్యాణం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఎందుకంటే వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు ఈ హీరో , సరిగ్గా ఆ సమయంలోనే దిల్ రాజు బ్యానర్ లో అనగానే వెంటనే శ్రీనివాస కళ్యాణం చేసాడు . కట్ చేస్తే నిన్న విడుదలైన ఈ చిత్రానికి వసూళ్లు అంతగా లేవు అయితే రేపు ఎల్లుండి కలెక్షన్లు బాగానే ఉండొచ్చు . ఇక కమల్ హాసన్ విశ్వరూపం 2 విషయానికి వస్తే …… విశ్వరూపం హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి రోజునే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది . రెండు రోజుల్లో వచ్చిన రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి కాబట్టి విజయ్ దేవర కొండ కు ఎదురే లేకుండా పోయింది . దాంతో ఈనెల 15న వచ్చి దుమ్ము దుమారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: line clear for vijay devarakonda