
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య కారణాలతో బాధపడుతున్నారని, ఆ కారణంగానే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదని, డాక్టర్ల సలహా మేరకు రజనీ పబ్లిక్ మీటింగ్‌లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఆకారణంగా కొంత కాలం రజనీ రాజకీయాలకు దూరంగా వుండాలనుకుంటున్నారని ఇటీవల రజనీ రాసిన లెటర్ అంటూ తమిళనాట హల్చల్ చేసింది.
దీనిపై రజనీ వివరణ కూడా ఇచ్చారు. రాజకీయ పార్టీకి సంబంధించిన వార్తలు నిజం కాదని చెప్పిన రజనీ తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు నిజమేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త తమిళ నాట వైరల్‌గా మారింది. రజనీకాంత్ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయోపిక్‌ని ఇప్పుడే ప్రారంభించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్‌కి యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్. లింగు స్వామి దర్శకత్వం వహించాలనుకుంటున్నారట.
ఈ బయోపిక్‌లో రజనీ అల్లుడు, హీరో ధనుష్ నటించే అవకాశం వుందని తెలిసింది. కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా రజనీ ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ధనుష్ మాత్రమే రజనీ పాత్రకి పర్ఫెక్ట్ అని దర్శకుడు లింగు స్వామి బలంగా నమ్ముతున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని త్వరలో చేయబోతున్నారని తెలిసింది.