లిప్ లాక్ లు ఎక్కువ అవుతున్నాయి


lip lock posters goes viral

తెలుగు సినిమాలలో ఒకప్పుడు లిప్ లాక్ సీన్స్ లాంటివి ఏమైనా ఉంటే హీరో హీరోయిన్ లు తలలు పట్టుకొని పక్కకు తిప్పుతారు , అదే విధంగా కెమెరా యాంగిల్ కూడా మారుతుంది అంటే అది అప్పట్లో లిప్ లాక్ అన్నమాట ! కానీ కాలం మారింది ,లిప్ లాక్ సీన్లు మెల్లిగా పెరుగుతూ వచ్చాయి ఇక ఇప్పుడేమో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి ఎక్కువ సినిమాలలో . ఇటీవలి కాలంలో లిప్ లాక్ లేని సినిమాలు వేళ్ళ మీద లెక్కపొట్టోచ్చు . అంతగా లిప్ లాక్ సినిమాలు పెరిగిపోయాయి .

అయితే లిప్ లాక్ సీన్స్ ఉన్నప్పటికీ ,వాటిని పోస్టర్ లలో , ట్రైలర్ లలో చూపించే వాళ్ళు తక్కువ కానీ అర్జున్ రెడ్డి చిత్రం నుండి సరికొత్త ఊపొచ్చింది చాలామంది లిప్ లాక్ ఉన్న పోస్టర్ లను , ట్రైలర్ లను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ కొట్టేస్తున్నారు ఆయా దర్శక నిర్మాతలు . తాజాగా వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన ” తొలిప్రేమ ” లో లిప్ లాక్ సీన్ ఉంది కాగా ఇప్పుడు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .