తల్లి అయిన హీరోయిన్


lisa ray had twin daughters

బాలీవుడ్ భామ లీసా రే తల్లి అయ్యింది , ఒక్కసారిగా కవలలు పుట్టడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది లీసా రే . క్యాన్సర్ తో పోరాడి సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది లీసా రే , అయితే ట్రీట్ మెంట్ తో మనోధైర్యంతో క్యాన్సర్ ని జయించిన తర్వాత 2012 లో జాసన్ దేహ్ని ని పెళ్లి చేసుకుంది లీసా రే . పెళ్లి అయి ఆరేళ్ళు కావస్తున్నప్పటికీ మధ్యలో పిల్లలు కాకపోవడంతో కొంత నిరాశ చెందినప్పటికీ తాజాగా తల్లి కావడం అందునా కవల పిల్లలు పుట్టడంతో లీసా రే చాలా సంతోషంగా ఉంది .

లీసా రే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది , ప్రస్తుతం జార్జియా లో ఉంది లీసా రే . లీసా రే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది అయితే సరోగసి ద్వారా సుమా ! అద్దె గర్భం ద్వారా అన్నమాట ! లీసా రే క్యాన్సర్ బారిన పడి మళ్ళీ కోలుకుంది కాబట్టి గర్భం దాల్చడం , అది నిలబడటం కష్టమని భావించి ఆమెకు కష్టం కలగకుండా సరోగసి ద్వారా పిల్లలను కన్నారు . మొత్తానికి అందరూ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు . త్వరలోనే ఇండియా వచ్చాక గ్రాండ్ గా పార్టీ ఇవ్వడానికి సమాయత్తం అవుతోంది లీసా రే .

English Title: lisa ray had twin daughters