అద్వానీ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన సలహా


నీ బహిరంగ సభలకు , రోడ్ షోలకు వస్తున్న జనాలంతా ఓట్లు వేస్తారని భ్రమపడి పోవద్దు , ఆ ఒక్క విషయంలో జనాలు వచ్చారని మితిమీరిన విజయదరహాసం ప్రదర్శిస్తే రాజకీయాల్లో బొక్కా బోర్లా పడటం ఖాయం ……… మీ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సంగతి ఏమైందన్న విషయం కూడా నీకు తెలియంది కాదు కాబట్టి జనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు  సలహా ఇచ్చాడట రాజకీయ భీష్ముడు , భారత మాజీ ఉప ప్రధాని  లాల్ కృష్ణ అద్వానీ . 
 
దేశ రాజకీయాలను నరనరాన జీర్ణించుకున్న అద్వానీ ఇచ్చిన సలహా ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా పాటిస్తున్నాడు అందుకే కాబోలు మా బలం ఎంతో తెలుసుకొని ఆ సీట్లలో మాత్రమే పోటీ చేస్తామని అంటున్నాడు పవన్ కళ్యాణ్ . కొద్దికాలం క్రితం పవన్ దూకుడు గా వెళ్ళేవాడు కానీ అద్వానీ సలహా , అలాగే చంద్రబాబు చెబుతున్న విషయాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తో పవన్ కళ్యాణ్ కు స్పష్టత వచ్చిందట అందుకే దూకుడు తగ్గించాడు .