`ఆచార్య‌` సెట్స్‌పై వుండ‌గానే మ‌రో క‌థ‌!

`ఆచార్య‌` సెట్స్‌పై వుండ‌గానే మ‌రో క‌థ‌!
`ఆచార్య‌` సెట్స్‌పై వుండ‌గానే మ‌రో క‌థ‌!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నతాజా ‌చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిష ఈ చిత్రం నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్నారు.

త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్‌ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేసుకున్న త‌రుణంలో క‌రోనా భారీ ఝ‌ల‌క్ ఇచ్చింది. దీంతో లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు మొత్తం ఆగిపోయాయి. ఈ వ‌రుస‌లో చిరు `ఆచార్య‌` షూటింగ్ కూడా ఆపే‌శారు. ఇదిలా వుంటే క‌రోనా కేసులు పెరుఉతుండ‌టంతో కేంద్రం మే 3 వ‌ర‌కు లాక్ డౌన్ ని పొడిగించింది. అయితే దాన్ని 7 వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం పొడిగింది.

దీంతో అంతా ఇంళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. గ‌త నెల రోజులుగా ఇంటి ప‌ట్టునే వుంటున్న సినీ సెల‌బ్రిటీస్ ఎవ‌రికి తోచిన ప‌నులు వారు చేస్తున్నారు. ద‌ర్‌శ‌కులు మాత్రం కొత్త క‌థ‌ల్ని వండ‌టం మొద‌లుపెట్టారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ లాక్ డౌన్ టైమ్‌ని కొత్త స్క్రిప్ట్‌ని సిద్ం చేయ‌డానికి ఉప‌యోగిస్తున్నాడ‌ని తెలిసింది. `ఆచార్య‌` రిలీజ్‌కి ముందు మ‌రో క‌థ‌లో కొర‌టాల సిద్ధం అవుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.