మహర్షి నిర్మాతల మధ్య లొల్లి


దిల్ రాజు , పివిపి మరియు అశ్వనీదత్
దిల్ రాజు , పివిపి మరియు అశ్వనీదత్

మహర్షి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల మధ్య లొల్లి షురూ అయ్యింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా మహర్షి చిత్రాన్ని నిర్మించారు . అయితే ఈ సినిమాకు అత్యధికంగా 150 కోట్ల ఖర్చు అయ్యిందని లెక్కలు చెబుతున్నారు . ఏ రకంగా చూసినా ఇవి దొంగ లెక్కలే ! అయితే ఆ లెక్కలను పక్కన పెడితే సినిమా రిలీజ్ కి వచ్చింది కాబట్టి బిజినెస్ పరంగా రకరకాల చిక్కులు వస్తున్నాయి .

దాంతో అశ్వనీదత్ ఒకవైపు దిల్ రాజు , పివిపి లు మరోవైపు గా ఈ పోరు సాగుతోంది . అశ్వనీదత్ నిర్మించిన దేవదాస్ నష్టాలు ఈ సినిమాకు శాపంగా మారాయి . దాంతో ఈ ముగ్గురు నిర్మాతల మధ్య లొల్లి అవుతోందట . మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ మహర్షి ని కష్టాలు వీడటం లేదు . ఇప్పటికే మహర్షి చిత్రానికి సరైన బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ ఎలా అని బాషపడుతుంటే ఇప్పుడేమో ఈ లొల్లి మహర్షి ని ఇబ్బంది పెడుతున్నాయి .