చిరు ఇంటి ముందు మళ్ళీ లొల్లి


Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు మళ్ళీ లొల్లి మొదలయ్యింది . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు తాజాగా మరోసారి చిరు ఇంటి వద్ద గొడవకు దిగారు . రెండు నెలల ముందు ధర్నా కు దిగిన సమయంలో రంగప్రవేశం చేసిన పోలీసులు వాళ్లకు సర్దిచెప్పి పంపించారు . అయితే మాకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని , మా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని చేస్తూ బాగా సొమ్ము చేసుకుంటున్నారు కానీ మాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉయ్యాలవాడ కుటుంబీకులు .

చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . అక్టోబర్ 2 న ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది . ఉయ్యాలవాడ బయోపిక్ గా తెరకెక్కుతున్న సైరా పై భారీ అంచనాలు ఉన్నాయి . దాంతో మాకు కూడా లబ్ది చేకూరాలని ఆశిస్తున్నారు ఉయ్యాలవాడ కుటుంబీకులు . చరణ్ జోక్యం చేసుకున్నప్పటికీ ఇంకా ఓ కొలిక్కి మాత్రం రాలేదు .