బయ్యర్ల ని ముంచేసిన దేవదాస్


 loss for devadas buyers 

అక్కినేని నాగార్జున , నాని ల కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన దేవదాస్ బయ్యర్లకి దాదాపుగా ముంచేసింది . అన్ని ఏరియాలు కలుపుకొని దాదాపు 36 కోట్ల బిజినెస్ జరిగింది . అంటే 36 కోట్ల షేర్ వస్తే బయ్యర్లు హ్యాపీ కానీ ఇప్పటివరకు 40 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించాడు దేవదాస్ . 40 కోట్ల గ్రాస్ వసూళ్లు 22 కోట్ల షేర్ మాత్రమే సంపాదించాడు అంటే బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే మరో 14 కోట్ల షేర్ రాబట్టాలి దేవదాస్ కానీ పరిస్థితి చూస్తుంటే మరో నాలుగు కోట్ల షేర్ కూడా రాబట్టడం కష్టమే అనిపిస్తోంది . ఈరోజు ఎలాగూ విజయ్ దేవరకొండ నటించిన నోటా విడుదల అయ్యింది దాంతో దేవదాస్ కలక్షన్లు మరింతగా డ్రాప్ అవ్వడం ఖాయం .

ఆ తర్వాతి వారం ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అవుతోంది దాంతో దేవదాస్ కలెక్షన్ల కు కొరత ఏర్పడినట్లే ! అంతేకాదు దేవదాస్ ఉన్న థియేటర్ లు కూడా లేపేస్తారు అరవింద సమేత రాకతో దాంతో దేవదాస్ బయ్యర్లు నష్టపోయినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . నాగార్జున – నాని లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమా అయినప్పటికీ ఫలితం దారుణంగా ఉండటంతో బయ్యర్లు బెంబేలెత్తి పోతున్నారు . నాగార్జున – నాని మేజిక్ ఏమాత్రం బాక్సాఫీస్ వద్ద పనిచేయలేదు .

English Title: loss for devadas buyers