శృంగారానికి అగ్ర తాంబూలం ఇచ్చారా ఆ సినిమాలో


lot of romantic scenes between vijay devarakonda and rashmika in geetha govindam విజయ్ దేవరకొండరష్మిక మండన జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం చిత్రంలో శృంగారానికి అగ్ర తాంబూలం ఇచ్చినట్లుగా గోచరిస్తోంది . ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్ కానీ సంభాషణలు కానీ వాటినే సూచిస్తున్నాయి . రకరకాల భంగిమల్లో హీరోయిన్ రష్మిక ని విజయ్ దేవరకొండ ఎత్తుకున్న తీరు ఇందుకు నిదర్శనం . రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ గీత గోవిందం లో వీళ్ళ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కుర్రకారు ని పిచ్చేక్కించేలా ఉంది . కౌగిలింతలు , ఎత్తుకోవడాలు ….. ఆ ఎత్తుకునే క్రమంలో ఎక్కడెక్కడో తగులుతున్న చేతులు మొత్తంగా రొమాన్స్ ని బాగానే పండిస్తున్నారు , స్టిల్స్ లోనే ఈ రకమైన రొమాన్స్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో రొమాన్స్ ఉంటుందో .

వరుస విజయాలు సాధిస్తున్న విజయ్ దేవరకొండ కు మద్యలో చిన్న కుదుపులు వచ్చాయి కానీ అర్జున్ రెడ్డి , మహానటి విజయాల ముందు అవి దిగదుడుపు అయ్యాయి ఇక ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే నిన్న మొన్న విడుదలైన చిత్రాలు విశ్వరూపం 2 , శ్రీనివాస కళ్యాణం లకు ఫ్లాప్ టాక్ వచ్చింది అంటే గీత గోవిందం కు లైన్ క్లియర్ అయినట్లే కదా ! గీత గోవిందం చిత్రం ఆగస్ట్ 15 న విడుదల కానుంది .

English Title: lot of romantic scenes between vijay devarakonda and rashmika in geetha govindam