ఇంతియాజ్ అలీ ని బూతులు తిడుతున్న ఫ్యాన్స్


Love Aaj Kal movie facing criticism
Love Aaj Kal movie facing criticism

“దగ్గలేనప్పుడు మర్యాదగా దగ్గలేనని ఒప్పుకోవాలి కానీ, ఎదో పెద్ద దగ్గుబాటి రానా లాగా బిల్డప్ ఇవ్వకూడదు” అని, గతంలో ఒక పెద్దాయన చెప్పారు. సినిమా ఇండస్ట్రీ లో ఒక పీక్ టైం వచ్చినప్పుడు ఎవరికైనా క్రియేటివిటీ కొంచెం వీక్ అవుతుంది. అలాంటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ రీఫ్రెష్ అయ్యి పనిలోకి దిగాలి కానీ, “పైన పిట్టను చూపించి కింద మసాలా నూరే సెటప్”, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే” విజ్ఞాన ప్రదర్శన చెయ్యకూడదు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా, భజన చేసే నోటితోనే ఒక్క సెకండ్ కూడా లేట్ చెయ్యకుండా ఇదే జనాలు బూతులు తిడతారు. భజన అయినా ఎదో ఫార్మాలిటీగా చేసే ప్రేక్షక దేవుళ్ళు, బూతులు మాత్రం గుండె లోతుల్లోంచి వచ్చేలా తిడతారు.

ఇప్పుడు అదే పని “లవ్ ఆజ్ కల్ 2” సినిమా విషయంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ విషయంలో ప్రూవ్ చేస్తున్నారు బాలీవుడ్ ఆడియెన్స్. సర్ తీసిన “లవ్ ఆజ్ కల్ 2” సినిమా ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్ అయ్యింది. బరిలో ఇంకా ఏ సినిమాలు కూడా లేవు. అలాంటప్పుడు సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకెళ్ళాలి, కానీ ఈ సినిమాను అటు ఫ్యాన్స్, ఇటు క్రిటిక్స్ ఏసిపడేస్తున్నారు. 2010 లో వచ్చిన “లవ్ ఆజ్ కల్” కు దీనికి పోలిక లేదని, ఆ సినిమా స్థాయిలో కూడా లేదని, ముఖ్యంగా హీరోయిన్ స్వయానా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఓవర్ యాక్షన్ ఏ మాత్రం సినిమాకు సింక్ అవ్వలేదని అంటున్నారు. సినిమా మొత్తంలో బాగున్నదల్లా, రణదీప్ హూడా – ఆరుషి ల ఎపిసోడ్ మాత్రమేననీ, అది కూడా చాలా తక్కువ నిడివి ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రీతం మ్యూజిక్, అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ, కార్తీక్ – సారా కెమిస్ట్రీ తప్ప సినిమాలో ఏమీ లేదని, తర్వాత వచ్చే సీన్ ఏంటో ముందే తెలిసేంత బలహీనంగా స్క్రీన్ ప్లే ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి అప్పటి సినిమాను గుర్తు చేస్తూ, కొంచెం లేత రొమాంటిక్ సీన్స్ యాడ్ చేసి, ఇంతియాజ్ అలీ సర్ సినిమా చుట్టేసాడని విమర్శిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఇంత ఓవర్ హైప్ వస్తే, ఏ మాత్రం సినిమా తగ్గినా, ఇలాగే నెగిటివ్ అవుతుంది.