మాజీ ల‌వ‌ర్స్ ర‌చ్చ మామూలుగా లేదుగా!


మాజీ ల‌వ‌ర్స్ ర‌చ్చ మామూలుగా లేదుగా!
మాజీ ల‌వ‌ర్స్ ర‌చ్చ మామూలుగా లేదుగా!

ఆ ఇద్ద‌రు మాజీ ల‌వ‌ర్స్. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక‌ప్పుడు హాట్ జోడీగా నిత్యం వార్త‌ల్లో నిలిచారు. ఎక్క‌డ పార్టీ జ‌రిగానా రెక్క‌టు క‌ట్టుకుని వాలిపోయి హంగామా చేసేవారు. షూటింట్ విరామం చిక్కితే చెట్ట‌ప‌ట్టాలేసుకుని షికార్లు కొట్టేవారు. ఇద్ద‌రూ క‌లిసి పెళ్లిపీట‌లెక్కుతార‌ని అంతా భావించారు. కానీ ఈగోస్ కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య తేడాలొచ్చాయి. మ‌న‌సులు మారాయి. ఇంకేముంది సీన్ రివ‌ర్స్ పెళ్లి దాకా వెళ్లాల్సిన ప్రేమాయ‌ణం కాస్త బ్రేక‌ప్ అయ్యింది. ఎంత మందికి షాక్‌నిచ్చింది. ఇంత‌కీ ఆ జంట మ‌రెవ‌రో కాదు త‌మిళ హీరో శింబు, వైట్ బ్యూటీ హ‌న్సిక‌.

విడిపోయిన ఈ జంట మ‌ళ్లీ రొమాన్స్ చేస్తూ ర‌చ్చ చేస్తోంది. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదు సుమీ. రీల్ లైఫ్‌లో. త‌మిళంలో ఖుష్బూ త‌రువాత గుడి క‌ట్టేంత ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంది హ‌న్సిక‌. అయితే గ‌త కొంత కాలంగా ఆ క్రేజ్ త‌గ్గుతూ వ‌స్తోంది. వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. కెరీర్ అంత ఆశాజ‌న‌కంగా లేదు. గ‌తంతో పోలిస్తే తెలుగు, త‌మిళ భాష‌ల్లో హ‌న్సిక గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కుంటోంది. హార‌ర్ చిత్రాల్లో న‌టిస్తూ మళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న హ‌న్సిక ప్రస్తుతం `మ‌హా` పేరుతో త‌మిళంలో హీరోయిన్ ప్ర‌ధాన చిత్రం రూపొందుతోంది.

జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. బ్ల‌డ్‌తో నిండిన‌ బాత్ ట‌బ్బులో హ‌న్సిక వున్న ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారాయి. తాజాగా మ‌రో పిక్‌ని మేక‌ర్స్ వ‌దిలారు. ఈ స్టిల్‌లో హ‌న్సిక త‌న మాజీ ప్రియుడు శింబుతో క‌లిసి రొమాన్స్ చేస్తున్న స్టిల్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో హ‌న్సిక కోసం శింబు అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. సినిమాలోని ఓ సంద‌ర్భంలో వ‌చ్చే ఈ రొమాంటిక్ సీన్‌తో మేక‌ర్స్ సినిమాకు హైప్‌ని తీసుకురావాల‌ని చేసిన ప్లాన్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌నిపిస్తోంది. హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త్వ‌రలోనే రిలీజ్ కానుంది.