సాయిప‌ల్ల‌వి ఏడిపించేసిందిగా!


Love story hey pilla first single out
Love story hey pilla first single out

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల `ఫిదా` చిత్రంతో మ‌ళ్లీ స‌క్సెస్ బాట‌ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా తువాత ఆయ‌న మ‌ళ్లీ అదే త‌ర‌హా సెన్సిబులిటీస్‌తో చేస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పి. రామ్మోహ‌న్‌రావుతో క‌లిసి శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంది.

తెలంగాణ నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ట‌. ప‌క్కా తెలంగాణ గ్రామీణ వాతావ‌ర‌ణం నుంచి సిటీకి వ‌చ్చిన జంట‌గా నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ఇందులో న‌టిస్తున్నారు. శుక్ర‌వారం వాలెంటైన్స్‌డే స్పెష‌ల్ గా ఈ చిత్రానికి సంబంధించిన `హే పిల్లా…` అంటూ సాగే వ‌న్ మినిట్ సాంగ్ వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగ‌చైత‌న్య‌కు సాయిప‌ల్ల‌వి స‌డెన్‌గా ముద్దుపెట్టే స‌న్నివేశాలు. ముద్దు పెట్ట‌గానే భావోద్వేగానికి లోనై చైతూ ఏడుస్తున్న దృశ్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాలో వీరిద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో వ‌ర్క‌వుట్ అయిందో తెలిసిపోతోంది. ఈ సంద‌ర్భంగా `ముద్దు పెడితే ఏడుస్తార‌బ్బా` అంటూ సాయి ప‌ల్ల‌వి చెప్పే డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌ల్ని తెర కెక్కించ‌డంలో శేఖ‌ర్ క‌మ్ముల మాస్ట‌ర్‌. `ఫిదా` వంటి సెన్సిబుల్ ల‌వ్‌స్టోరీ త‌ర‌వాత శేఖ‌ర్ క‌మ్ముల – సాయిప‌ల్ల‌వి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రెహ‌మాన్ శిష్యుడు ప‌వ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో సంద‌డి చేయ‌బోతోంది.  ప్ర‌స్తుంత చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.  స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.