లవర్స్ డే క్లైమాక్స్ మార్చారు


Lovers day climax changed

వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ ,రోషన్ ,నూరిన్ షరీఫ్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం లవర్స్ డే . ఓరు ఆధార్ లవ్ మలయాళ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతో రిలీజ్ చేసారు నిర్మాతలు గురురాజ్ -వినోద్ రెడ్డి . ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేసారు . అయితే క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ లు చనిపోయే సీన్ తో ప్రేక్షకులు అసంతృప్తికి గురి కావడంతో హ్యాపీ ఎండింగ్ ఇస్తే మంచిదని భావించి క్లైమాక్స్ ని పూర్తిగా మార్చారు .

 

తెలుగు ప్రేక్షకులకు కావాల్సినట్లుగా క్లైమాక్స్ ని మార్చాము కాబట్టి తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని విశ్వసిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేసాడు నిర్మాత గురురాజ్ . రెండు తెలుగు రాష్ట్రాలలో 500 స్క్రీన్ లలో రిలీజ్ చేయగా దిగ్విజయంగా రెండో వారంలోకి ఎంటర్ అయ్యిందని, వంద థియేటర్ లలో రన్ అవుతోందని ఇప్పుడు క్లైమాక్స్ మార్చాం కాబట్టి యువతని మరింతగా అలరించడం ఖాయమని అంటున్నాడు నిర్మాత గురురాజ్ .