నూరిన్‌ షరీఫ్ కొత్త సినిమా “ఉల్లాలా ఉల్లాలా”…


Noorin Shereef
నూరిన్‌ షరీఫ్ కొత్త సినిమా “ఉల్లాలా ఉల్లాలా”…

మలయాళంలో వచ్చిన “ఒరు ఆదార్ ల‌వ్‌” సినిమా గుర్తుందా? అదేనండి “ప్రియా వారియ‌ర్‌” రెండు చేతులని తుపాకీలా పెట్టి కాల్చేయడం , రెండు కాళ్ళని ఆడిస్తూ మనసు దోచిన సినిమా తెలుగులో “ల‌వ‌ర్స్ డే“గా విడుదల అయింది. మొదట అందరూ ప్రియా వారియ‌ర్‌ కి బాగా పేరు వస్తుంది అనుకున్నారు, కానీ సినిమాలో ఇంకొక హీరోయిన్ ఉంది ఆమె పేరు “నూరిన్ షరీఫ్”. సినిమా తెలుగులో ఆడకపోయినా ఇద్దరికి మంచి పేరు వచ్చింది, ఇప్పుడు ఇద్దరు తెలుగులో బాగా బిజీ అయిపోయారు.

ఇద్దరికి ఇప్పుడు తెలుగులో వారిద్దరికీ మంచి పెద్ద దర్శకులు తమకి, తమ కథలకి కావాలి అని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రియా వారియ‌ర్‌ అయితే ఏకంగా “నితిన్ – చంద్ర శేఖర్ యేలేటి” సినిమాలో ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అది ప్రియా కి బాగా నచ్చిన పాత్ర అని చెప్పింది ఒక ఇంటర్వ్యూలో.

నూరిన్ షరీఫ్ కూడా తెలుగులో ఒక హారర్ – కామెడీ – థ్రిల్లింగ్ సినిమాలో నటిస్తుంది. సినిమాకి దర్శకుడిగా సీనియర్ నటుడు (కన్నడ – తెలుగు) “సత్య ప్రకాష్” గారు. నిర్మాతగా “ఏ. గురురాజ్” గారు సినిమాని బాగా కథని నమ్మి నిర్మిస్తున్నారు. సినిమా పేరు “ఉల్లాలా ఉల్లాలా” అని రిజిస్టర్ చేయించారు. అయితే సినిమాకి నూరిన్ ని కావాలని తీసుకున్నారు. కారణం లవర్స్ డే లో తాను చేసిన పాత్ర నచ్చి. ఇక ఈ సినిమాలో నూరిన్ పాత్ర బాగా ఉంటుంది, మంచిగా నటిస్తుంది అని అంటున్నారు సినిమా సభ్యులు.

ఇక నూరిన్ కూడా మాట్లాడుతూ, తెలుగులో చాలా కథలు విన్నాను కానీ, ఏవి నాకు నచ్చలేదు.. ఈ సినిమా అయితే నాకు నటన పరంగా చెప్పడానికి అటు క్లాస్ – ఇటు మాస్ ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుఇతుంది అని ధీమా వ్యక్తం చేస్తుంది.

చూద్దాం మరి నూరిన్ చెప్పినట్లే సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో? నటుడు సత్య ప్రకాష్ గారు కూడా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాను… తన దర్శకత్వం మన అందరికి నచ్చుతుంది అని అంటున్నారు.