లవర్స్ డే రివ్యూ


Lover’s Day Movie Review Rating

లవర్స్ డే  రివ్యూ :
నటీనటులు : ప్రియా ప్రకాష్ వారియర్ , రోషన్
సంగీతం : షాన్ రెహమాన్
నిర్మాతలు : గురు రాజ్ – వినోద్ రెడ్డి
దర్శకత్వం : ఒమర్ లులు
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి 2019

కొంటెగా కన్ను గీటుతూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భామ ప్రియా ప్రకాష్ వారియర్ . మలయాళ చిత్రమైన ” ఒరు ఆదార్ లవ్ ” చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ చేసారు . లవర్స్ డే రోజున వచ్చిన ఈ లవర్స్ డే చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

రోషన్ ( రోషన్ ) ప్రియా ( ప్రియా వారియర్ ప్రకాష్ ) ని చూసిన తొలిచూపులోనే ప్రేమిస్తాడు . ఇక ప్రియా కూడా రోషన్ ని ఇష్టపడుతుంది కానీ తన ప్రేమని బయటకు వ్యక్తం చేయదు . రోషన్ – ప్రియా ల ప్రేమ వ్యవహారం లో గాద (నూరిన్ షెరిఫ్ ) కీలక పాత్ర పోషిస్తుంది . అయితే రోషన్ – ప్రియా లు అనుకోకుండా చేసిన తప్పుతో విడిపోతారు . అయితే వాళ్ళని మళ్ళీ కలపడానికి గాద ఏం చేసింది ? రోషన్ – ప్రియా లు మళ్ళీ ఒక్కటయ్యారా ? గాద కు రోషన్ కు ఉన్న సంబంధం ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్

రోషన్

నూరిన్ షరీప్ గ్లామర్ , యాక్టింగ్

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ తో అలరించింది అలాగే రోషన్ తో ఈ భామ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యింది . కొంటెగా కన్నుగీటుతూ యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రియా ప్రకాష్ వారియర్ మొదటి చిత్రంతోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకుంది . అలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది . హీరో హీరోయిన్ ల తర్వాత నూరిన్ షెరిఫ్ పాత్రకు ప్రాధాన్యత ఉంది దాంతో చక్కగా వినియోగించుకుంది నూరిన్ . నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా అలరించింది .

సాంకేతిక వర్గం :

శీను సిద్దార్థ్  అందించిన విజువల్స్ బాగున్నాయి . షాన్ రెహమాన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి అయితే నేపథ్య సంగీతం మరింతగా ఎలివేట్ అయ్యింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడి విషయానికి వస్తే …… యువతకు నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించి యువత మెప్పు పొందాడు . అయితే స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా :

యువతకు నచ్చే లవర్స్ డే

English Title: Lover’s Day Movie Review Rating

Click here for English Review

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage