`లూసీఫ‌ర్`‌ని కంప్లీట్‌గా మార్చేశారా?

`లూసీఫ‌ర్`‌ని కంప్లీట్‌గా మార్చేశారా?
`లూసీఫ‌ర్`‌ని కంప్లీట్‌గా మార్చేశారా?

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ‌ల‌యాళ రీమేక్ చిత్రాల హ‌వా న‌డుస్తోంది. అత్య‌‌ధ‌క శాతం మెగా హీరోలే మ‌ల‌యాళ హిట్ చిత్రాల రీమేక్‌ల‌లో న‌టిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. మోహ‌న్‌రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీని పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభించారు.

త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఆర్.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్‌. ప‌రాస్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాజిటీజ్‌గా కాకుండా క‌థ‌లోని ప్ర‌ధాన లైన్‌ని మాత్ర‌మే తీసుకుని ఫ్రెష్‌గా చేస్తున్నామ‌ని మోహ‌న్‌రాజా ఇటీవ‌ల వెల్ల‌డించాడు. అయితే కొత్త‌గా ఎలాంటి మార్పులు చేశారు? .. చిరు ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌ని ఎలా మ‌లిచార‌న్న‌దానిపై అభిమానుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

`లూసీఫర్‌`లో మోహ‌న్‌లాల్ పోషించిన పాత్ర‌ని తెలుగులో చిరంజీవి చేస్తున్నారు. మాతృక‌లోని పాత్ర సీరియ‌స్ టోన్‌లో సాగుతుంది. పెద్ద‌గా పాట‌లు వుండ‌వు.. హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలూ త‌క్కువే…మాస్ అంశాలు కూడా అంతంత మాత్ర‌మే.. కానీ తెలుగులో చిరుని దృష్టిలో పెట్టుకుని చాలా మార్పులు చేశార‌ట‌. చిరు కోసం కామెడీతో పాటు పాట‌లు, రొమాంటిక్ స‌న్నివేశాల్ని కూడా జోడించ‌డంతో పాటు యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని ఓ రేంజ్‌లో ప్లాన్ చేశార‌ని తెలిసింది. దీంతో మెగా ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.