మొత్తానికి బాబి కి సినిమా వచ్చింది


lucky chance to director bobbyసర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రం చేసినప్పటికీ దర్శకులు బాబీ కి మాత్రం మరో సినిమా అంత ఈజీగా దొరకలేదు . రకరకాల సినిమాల పేర్లు వినిపించినప్పటికీ ఫలానా హీరోతో బాబీ సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అవేవి నిజం కాలేదు దాంతో జై లవకుశ వంటి హిట్ ఇచ్చినప్పటికీ కూడా వెయిటింగ్ తప్పదా అని అనుకున్నారు కట్ చేస్తే అన్ని అడ్డంకులు తొలిగి ఓ మల్టీస్టారర్ సినిమా చేసే ఛాన్స్ లభించింది దాంతో బాబీ ఖుషీ .

 

సీనియర్ హీరో వెంకటేష్ – నాగచైతన్య ల కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలనుకున్నారు అయితే ఆ సినిమా కు దర్శకులు మొదట వేరు కానీ బాబీ అదృష్టం బాగుండటంతో ఆ ఛాన్స్ బాబీ ని వరించింది . అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండదు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే అటు వెంకటేష్ ఇటు నాగచైతన్య ఇద్దరు కూడా బిజీ గా ఉన్నారు కాబట్టి .