మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన సుద్దాల అశోక్ తేజ?


మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన సుద్దాల అశోక్ తేజ?
మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన సుద్దాల అశోక్ తేజ?

ప్ర‌ముఖ సినీ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న సుద్ధాల అశోక్‌తేజకు మే 24న హైద‌రాబాద్ గ‌చ్చిబౌలీలోని ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు లివ‌ర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ఆప‌రేష‌న్ చేశారు. ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా జ‌రిగింద‌ని, సుద్దాల క్షేమంగా వున్నార‌ని న‌టుడు, సుద్దాల మేన‌ల్లుడు ఉత్తేజ్ మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఉద‌యం 9:30 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుద్దాల‌కు డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఆయ‌న త‌న‌యుడు అర్జున్ కాలేయాన్ని దానం చేశారు. ఈ సంద‌ర్భంగా రక్తదానం చేసిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు, స్వ‌యంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పిన మెగాస్టార్ చిరంజీవిగారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌ల‌ని ఉత్తేజ్ ఆప‌రేష‌న్ అనంత‌రం వెల్ల‌డించారు.

ఇదిలా వుంటే సుద్దాల మ‌ళ్లీ అనారోగ్యానికి గురైన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. సుద్దాల‌కు చేసిన లివ‌ర్ ఆప‌రేష‌న్ బా‌గానే జ‌రిగిన ఆయ‌న లివ‌ర్ ఇన్ఫెక్ష‌న్‌కు గురైంద‌ని, దాని కార‌ణంగా సుద్దాల మ‌ళ్లీ అనారోగ్యానికి గురైనట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబ స‌భ్యులు ఏమ‌ని వెల్ల‌డిస్తారో చూడాలి.