అతడు చీఫ్ గెస్ట్ అంటే బాలయ్య వ్యూహం ఏంటో


m venkayyanaidu chief guest for balakrishnas ntr biopic ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలి అంటూ రాజ్యసభలో గట్టిగా డిమాండ్ చేసిన వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు , అయితే ఆ తర్వాత బిజెపి అధికారంలోకి వచ్చింది వెంక్కయ్య కేంద్రమంత్రి అయ్యాడు ఇక ఇప్పుడేమో ఏకంగా భారత ఉపరాష్ట్ర పతి అయ్యాడు . కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ప్రత్యేక హోదా లేదు , ప్రత్యేక ప్యాకేజీ అన్నారు . ఇక ఇప్పుడేమో అన్నీ ఇచ్చేశాం అని అంటున్నారు బిజెపి వాళ్ళు దాంతో బీజేపీ – టిడిపి వాళ్లకు సఖ్యత లేకుండా పోయింది . కేంద్ర ప్రభుత్వం తో తెలుగుదేశం బద్ద శత్రువులా పోరాడుతోంది .

అయితే ఈ సమయంలో బాలకృష్ణ తన సినిమాకు చీఫ్ గెస్ట్ గా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని ఆహ్వానించారు . ఇది కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది . ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోంది అని ఓ పక్క అంటూనే మరోవైపు వెంకయ్య నాయుడి ని ఆహ్వానించడంలోని ఆంతర్యం ఏంటో . ? బాలయ్య వ్యూహం ఏంటో మరి .