మాలో అవినీతి జరిగిందా


MAA fund misuse issueమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో అవినీతి జరిగినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రచురించడంతో సంచలనం అయ్యింది . మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడి గా శివాజీరాజా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అయితే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ కట్టించాలన్న ఆలోచనతో మెగాస్టార్ చిరంజీవితో విదేశాల్లో ఓ ఈవెంట్ ని నిర్వహించారు . కాగా ఆ ఈవెంట్ లో కోటి రూపాయల నిధి సమకూరినట్లు తెలిసింది అయితే ఆ ఈవెంట్ కోసం మా సభ్యులు వెళ్లారు కాగా దాని నిమిత్తం పెట్టిన ఖర్చు లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు సదరు ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది .

అంటే దాని సారాంశం ప్రకారం శివాజీరాజా బాధ్యుడు అని తెలుస్తోంది . అయితే నరేష్ ప్రధాన కార్యదర్శి కావడంతో నరేష్ పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది . మాలో అవినీతి జరిగిందో లేదో తేల్చి చెప్పాల్సింది శివాజీరాజా , నరేష్ లే ! మరి ఈ ఇద్దరిలో ఎవరు మీడియా ముందుకు వస్తారో చూడాలి .